వెన్నెల ఆలోచన అదిరింది కదూ..

ఒకప్పటితో పోల్చితే నేటి తరానికి ఆరోగ్యంపై అవగాహన ఎన్నోరెట్లు పెరిగింది. చక్కటి ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిఒక్కరూ యోగా, వ్యాయామ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సినీప్రముఖులైతే హ్యాపీగా ఇళ్లలోనే జిమ్‌లను ఏర్పాటు చేసేసుకోని గంటల తరబడి వాటిలో గడిపేస్తున్నారు. అయితే వీళ్లంతా తమ క్యాలరీలు కరిగించుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తుంటే.. ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ మాత్రం ఓ సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోనే పైన కనిపిస్తున్నది. ఎంచక్కా ఓ చిన్న సైకిల్‌ ఎక్కేసి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ దానిపై చక్కర్లు కొడుతూ తన క్యాలరీలు కరిగించేసుకునే పనిలో పడిపోయారు. తాజాగా ఆయన షూటింగ్‌లకు కాస్త విరామమిచ్చి తన సొంతూరు వెళ్లారు. అక్కడే ఇలా సైకిల్‌పై సరదాగా రౌండ్లు కొడుతూ ఓ ఫొటోకు ఫోజిచ్చారు. దీన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. క్యాలరీస్‌ కరిగించుకుంటున్నా’’ అని ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను కూడా జోడించారు. ప్రస్తుతం దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.