ఫారెస్ట్ గంప్‌ చిత్ర రచయిత విన్‌స్టన్‌ గ్రూమ్‌ కన్నుమూత

అంతర్జాతీయంగా పేరొంది ఆస్కార్‌ అవార్డు గెల్చుకున్న చిత్రం ‘ఫారెస్ట్ గంప్’‌. ఈ సినిమా రచయిత విన్‌స్టన్‌ గ్రూమ్‌ కన్నుమూశారు. ఫిక్షన్‌ నాన్‌ ఫిక్షన్‌ రచయితగా సుమారు పదహారు పుస్తకాలు రచించారు. రాబర్ట్ జెమెకిస్‌ దర్శకత్వంలో టామ్‌ హంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్‌’ చిత్రం వినస్టన్‌ రాసిన నవలే ఆధారం. ఈ చిత్రం ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. ఆయన రాసిన ఫారెస్ట్ గంప్‌ నవల 1.7 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి. విన్‌స్టన్‌ గ్రూమ్‌  మార్చి 16, 1943లో వాషింగ్టన్‌లో జిన్మించారు. అలబామాలోని మొబైల్‌ కౌంటీలో పెరిగారు. కళాశాలలో ఉండగానే విన్‌స్టన్‌ రాయడం వైపు మొగ్గుచూపారు. అంతేకాదు అలబామా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్‌లో పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత వియాత్నం యుద్దంతో పాటు యుఎస్ సైన్యంలోనూ సుమారు నాలుగు సంవత్సరాల పాటు పనిచేశారు. ఆర్మీ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్లు పాత్రికేయుడుగాను పనిచేశారు. విన్‌స్టన్‌ రాసిన ‘యాజ్‌ సమ్మర్‌ డై’ (1981) పుస్తకానికి మంచి గుర్తింపు లభించింది. మరొక పుస్తకం ‘కన్వర్షన్‌ విత్‌ ది ఎనిమి’ పుస్తకానికి నాన్‌ ఫిక్షన్‌ స్టోరి విభాగానికి గాను పులిట్జర్‌ బాహుమతి పొందింది. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా అనే చిత్రం చేస్తున్నారు. 1994లో హాలీవుడ్‌ తెరపైకి వచ్చిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే చిత్రానికి ఇది రిమేక్‌. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.