అదరగొడుతున్న ‘పవర్‌ ఆఫ్‌ యూత్‌’ సాంగ్‌

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘యువరత్న’.సంతోష్‌ దర్శకుడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతుంది. ‘పవర్‌ ఆఫ్‌ యూత్‌’ అనే పాటకు సంబంధించిన ప్రొమో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఊపిరాగినా బతికే కిటుకు నేర్పిచూడు నీ ఆలోచనకు’ అంటూ మొదలయ్యే ఈ స్ఫూర్తిదాయక గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. తమన్‌ సంగీతం అందించారు. నకాష్‌ ఆజిజ్‌ ఆలపించారు. బీట్‌కి తగినట్టు పునీత్‌ డ్యాన్స్‌ అదరగొడుతుంది. పునీత్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో పునీత్‌ సరసన సాయేషా సైగల్‌, సోనూ గౌడ నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు. పూర్తి పాట డిసెంబరు 2న విడుదల కాబోతుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.