‘శేషాచలం’పై సుక్కు టీం క్లారిటీ

‘ఆర్య’, ‘ఆర్య2’ల తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల కలయికలో ముచ్చటగా మూడో చిత్రం పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ‘ఏఏ20’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం ఇప్పటికే కేరళలోని కీలక ప్రాంతాల్లో కొంత మేర చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం బన్ని తన తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆయన లేకుండానే చిత్రీకరణ షురూ చేశారు సుక్కు. వచ్చే నెల నుంచి స్టైలిష్‌ స్టార్‌ కూడా ఈ చిత్ర సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సుక్కు బృందం ‘శేషాచలం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ విషయంపై ట్విటర్‌మ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ‘‘అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఫైనల్‌ చెయ్యలేదు. కొన్ని మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం నిజం కాదు. టైటిల్‌ ఖరారవ్వగానే అధికారికంగా ప్రకటిస్తాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది చిత్ర బృందం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.