‘ఆది పురుష్‌’ అప్‌డేట్‌ ఇదే!

ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఆగస్టు 11, 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు ఓంరౌత్‌ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ చిత్రం గురించి నెట్టింట్లో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. భారీ బడ్జెట్‌, 3డీ చిత్రంగా రానున్న ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన సీతగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పాన్‌ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.