‘అఖిల్‌ 5’.. సురేందర్‌తో ఫిక్స్‌

ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి అఖిల్‌తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలొచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు దర్శకడు సురేందర్‌ రెడ్డి. ‘అఖిల్‌ 5’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనుంది. ప్రముఖ రచయిత, వక్కంతం వంశీ ఈ ప్రాజెక్టుకు పనిచేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సురేందర్‌ టు సినిమా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.