శుభవార్త వినిపించేశారు

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సినీప్రియులతో పాటు మెగా అభిమానులకు శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల క్రేజీ ప్రాజెక్టును రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. బన్నికి జోడీగా రష్మిక కనిపించబోతుందట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.