అందుకే ‘ఆమె’ను తొలగించారట!
సాధారణంగా ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకుంటే సినిమా విడుదలకు ముందే మరో చిత్రంలో నటించేందుకు నటులకు అవకాశం వస్తుంది. ఓ సినిమా టీజర్‌ని చూసి మరో సినిమా నుంచ తొలగించిన ఘటన అమలాపాల్‌కు ఎదురైంది. విజయ్, అమలాపాల్‌ జంటగా ఓ చిత్రం రావాల్సిఉండగా ‘ఆమె’ ప్రచార చిత్రం చూసి తనను ఆ సినిమా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పారితోషికం ఎక్కువ అడుగటంతోపాటు వివిధ షరతులు పెట్టారని అందుకే నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పందిస్తూ ఓ ప్రెస్‌నోట్‌ను విడదల చేసిందీ ఈ నటి.


‘‘పలు సినిమాలకు సంబంధించి పారితోషకం అందించడానికి నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసి నేనే వెనక్కి తగ్గేదాన్ని, ‘ఆమె’ సినిమా కోసం అడ్వాన్స్‌ మాత్రమే తీసుకున్నాను. ఈ చిత్ర టీజర్‌ విడుదలయ్యాకే నన్ను విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తొలగిస్తున్నామని నిర్మాత రత్న కుమార్‌ చెప్పారు. ఈ టీజర్‌తో వారి సినిమాపై నెగిటివ్‌ టాక్‌ వస్తుందోనన్న ఉద్దేశంతో తీసేసుంటార’’ని తెలిపింది. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితేనే పరిశ్రమ బావుంటుంది. విజయ్‌కి వ్యతిరేకంగా నేనీ విషయాలు చెప్పడంలేదు, ఆయనతో నటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.