‘అవెంజర్స్‌...’ కోసం ఏఆర్‌ రెహమాన్‌

హాలీవుడ్‌ సినిమాల్లో భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌’. ఆంథోని, జోయ్‌ రూసో దర్శకత్వంలో రూపొందింది. ఇప్పుడీ సినిమా భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ చిత్రానికి ఆస్కార్‌ విజేత సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ స్వరాలను సకూర్చబోతున్నారు. ఈ మేరకు మార్వెల్‌ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. 2014లో ప్రారంభమైన అవెంజర్స్‌ సిరీస్‌లో ఇది చివరిది. ‘‘భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సరైన సంగీత దర్శకుడు’’ అని మార్వెల్‌ పేర్కొంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.