‘అశ్వథ్థామ’ గురించి

యువ కథానాయకుడు నాగశౌర్య నటిస్తున్న చిత్రం ‘అశ్వథ్థామ’. దీని కోసమే ప్రత్యేకంగా కసరత్తులు చేసి కండలు పెంచి కొత్తగా తయారవుతున్నాడు శౌర్య. ఒక విభిన్న కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌ను ఈ శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అందుకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది. ఇది చారిత్రక సినిమా అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ రోజునే వెలువడే అవకాశం ఉంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.