బాలయ్య మొదలెట్టాడు
సంకాత్రికి వచ్చే సినిమాలు కూడా ప్రచారం మొదలుపెట్టి చాలా రోజులే అయింది. కాని బాలయ్య ‘రూలర్‌’గా డిసెంబర్‌లోనే వస్తున్నాని చెప్పాడు. ఇంత వరకు కొన్ని స్టైలిష్‌ లుక్స్‌ తప్ప మరే ప్రచారం చేయలేదు. ఇప్పటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. రేపే ఇందులోని మొదటి గీతాన్ని వినిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. రేపు ఉదయం ‘‘అడుగడుగు యాక్షన్‌ హీరో’’ అనే పాటని వినిపించబోతున్నారు. బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జైసింహ’ చిత్రాలకు సంగీతం అందించిన చిరంతన్‌ భట్‌ సంగీత స్వరకర్త. కె.యస్‌.రవి కుమార్‌ దర్శకుడు. సి.కళ్యాణ్‌ నిర్మాత. బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు కనిపించబోతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.