యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో కథకి పచ్చజెండా ఊపారు. సుధీర్‌వర్మ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రచయిత శ్రీకాంత్ కథని సమకూర్చారు. బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ పూర్తయ్యాక, సుధీర్‌వర్మ తెరకెక్కించనున్న సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ‘స్వామిరారా’, ‘దోచెయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ. సస్పెన్స్ థ్రిల్లర్‌ని తెరకెక్కించడంలో మంచి గుర్తింపు పొందాడు సుధీర్. బెల్లంకొండతో ఎలాంటి చిత్రం తీస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.