నవ్వించేందుకు సిద్ధమైన ‘భీష్మ’

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త వినిపించాడు నితిన్‌. ఇంతకీ ఎదురు చూపులు దేనికంటారా? ఆయన నటిస్తున్న ‘భీష్మ’ చిత్ర టీజర్‌ కోసం. ఈయన కథానాయకుడుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. తాజాగా టీజర్‌ విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. జనవరి 12న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘నవ్వులు పూయించే టీజర్‌ రాబోతుంది’ అని వ్యాఖ్యను జోడించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్, ఓ పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి టీజర్‌తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.