బాలకృష్ణతో సినిమా తీస్తా

బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్‌ అంటేనే హిట్‌ సినిమా వస్తుందని చిత్రసీమలో టాక్‌. గతంలో బాలయ్యతో కలిసి ‘సింహా’, ‘లెజెండ్‌’లాంటి చిత్రాలు అందించారు. ఈరోజు తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బోయపాటి మాట్లాడుతూ... ‘‘త్వరలోనే బాలయ్యతో ఓ సినిమా తీయబోతున్నాను. త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం గత సినిమాల కంటే కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు. చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బోయపాటి దర్శకత్వంలో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో రామ్‌చరణ్, కియారా అడ్వాణీ నటించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.