‘కేన్స్‌’కు వెళ్లిన తెలంగాణ చిత్ర పరిశ్రమ బృందం

పారిస్‌: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ కేన్స్‌కు వచ్చేశారు. ఈసారి కూడా తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన సందడి చేశారు. జీన్‌ లూయి సబాజీ డిజైన్‌ చేసిన గోల్డెన్‌ గ్రీన్‌ ఫిష్‌ కట్‌ గౌనులో ఐష్‌ సాగరకన్యలా మెరిసిపోయారు. ఆరాధ్య కూడా తన తల్లిలాగే లేత పసుపు రంగు గౌనులో ముస్తాబైంది. ఐశ్వర్య ఎన్నో ఏళ్లుగా కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఆమె ప్రముఖ పారిస్‌ కాస్మెటిక్‌ సంస్థ లారియల్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ 72వ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో భారత్‌ నుంచి కంగనా రనౌత్‌, డయానా పెంటీ, ప్రియాంక చోప్రా, హీనా ఖాన్‌, దీపికా పదుకొణె, హుమా ఖురేషీ హాజరై సందడి చేశారు. ఇక సోనమ్‌ కపూర్‌ రావడమే తరువాయి. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్‌ ఈసారి కేన్స్‌ వేడుకకు ఎలా వచ్చి సర్‌ప్రైజ్‌ ఇస్తారో వేచి చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.