కరోనా దెబ్బ: తెలంగాణలో థియేటర్లు బంద్‌


‘కొవిడ్‌ - 19’ దెబ్బకు ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది. ఈ మహమ్మారి ఇటు భారత్‌లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై దీన్ని అడ్డుకునేందుకు ముందస్తుగా నివారణ చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఈరోజు అర్ధ రాత్రి నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లను మూసి వెయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈ నెల 31 వరకు వర్తిస్తుంది. ఇప్పటికే కరోనా ప్రభావం కారణంగా కేరళ, దిల్లీ, బిహార్‌,  ముంబయి తదితర ప్రాంతాల్లోనూ థియేటర్లు, విద్యా సంస్థలు మూసి వేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రాంతంలోనూ ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తెలియడంతో ఇప్పటికే అక్కడ కూడా విద్యాలయాలు, థియేటర్లను మూసివేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.