దిల్‌రాజుకు వీరి కథ తెగ నచ్చేసిందట..

థ బావుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా, నటీనటులెవరు అని చూడకుండా ఆ చిత్రాల్ని ప్రేక్షకులకు అందించేందుకు ముందుంటారు నిర్మాత దిల్‌ రాజు. తాజాగా ఆయన మరో చిత్రాన్ని సమర్పించేందుకు ముందుకొచ్చారు. ఆది పినిశెట్టి- కీర్తి సురేశ్‌ జంటగా ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ దిల్‌రాజుకు తెగ నచ్చేయడంతో ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో సమర్పించేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాతలు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘వెల్‌కం ఆన్‌ బోర్డు సర్‌’ అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అంతేకాదు టైటిల్, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఇందులో జగపతిబాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వర్త్‌ ఎ షార్ట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని.. బాలీవుడ్‌ దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌ తెరకెక్కిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.