రొమాంటిక్‌ డ్రామగా వస్తున్న ఎం.ఎస్‌.రాజు చిత్రం

తెలుగు చలనచిత్రసీమలో ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’ లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శక నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఇప్పుడు రొమాంటిక్‌ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ‘డర్టీ హరి’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి గూడూరి శివరామకృష్ణ, సతీష్‌ బాబు, సాయి పునీత్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని శనివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. అయితే ఇంకా చిత్రానికి సంబంధించిన నాయికానాయకులతో పాటు సాంకేతిక చిత్ర బృందాన్ని ప్రకటించాల్సి ఉంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.