‘డిస్కోరాజా’ వచ్చేది ఆ రోజే

అభిమానులకు రవితేజ శుభవార్త చెప్పేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘డిస్కోరాజా’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారాయన. 2020 జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీతం తమన్‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందంలో మునిగిపోతున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.