‘డబుల్‌ డోస్‌’ కామెడీకి రెడీ

శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఢీ’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఘన విజయం అందుకుంది. దాంతో ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరు కలిసి పనిచేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు సినీ అభిమానులు. తాజాగా ఆ  సందేహానికి తెరపడింది. ఈ కాంబోలో త్వరలోనే మరో చిత్రం తెరకెక్కబోతుంది. నేడు (నవంబరు 23) విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశేషాన్ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ‘డి అండ్‌ డి’ డబుల్‌ డోస్‌ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఈసారి రెట్టింపు వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు వీరిద్దరు. 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. కథ, కథనం: గోపీ మోహన్‌, కిశోర్‌ గోపు, నాయిక వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే తెలియనున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.