‘దృశ్యం 2’ వస్తోంది

మోహన్‌లాల్‌, మీనా జంటగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. థ్రిల్లర్‌ క్రైం కథాంశంతో 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం అందుకుంది. అంతేకాడు అధిక భాషల్లో రీమేక్‌ అయిన చిత్రంగానూ నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త వినిపించింది చిత్ర బృందం.  మోహన్‌లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘దృశ్యం 2’ సినిమాను ప్రకటించింది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. సీక్వెల్‌నూ జీతూ జోపెఫే తెరకెక్కిస్తున్నారు.  ‘దృశ్యం’.. తెలుగులో వెంకటేశ్‌, మీనా నటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ అదే స్థాయిలో ఫలితం సాధించింది.  ‘దృశ్యం 2’ సినిమా ఈ ఆగస్టు 17 నుంచి ఫ్రారంభమౌతుందని వార్తలొస్తున్నాయి.  ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మా-AMMA) ఈ ఆదివారం (జులై  5) నాడు సమావేశమవుతోంది. అయితే ఈ చిత్రంపై నిర్మాణ సంస్థ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.