‘దర్బార్‌’ సంగీత వేడుక ఆ రోజే

వచ్చే ఏడాది విడుదల కాబోయే పాన్‌ ఇండియా చిత్రాలలో మొదటిది ‘దర్బార్‌’. ఇప్పటికే విడుదలైన పరిచయ గీతం అన్ని భాషల్లో దుమ్మురేపుతుంది. ‘దర్బార్‌’ గీతావిష్కరణ డిసెంబర్‌ 7న చెన్నైలో అట్టహాసంగా చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. మురుగదాస్‌ దర్శకుడు. అనిరుధ్‌ సంగీత స్వరకర్త. ఈ సంగీత వేడుకకు పలువురు భారతీయ సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2020 సంక్రాతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇంతకు మందు జనవరి 15న విడుదల చేస్తాం అని ప్రకటించినా ఈ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్‌ 12న సూపర్‌ స్టార్‌ జన్మదినం సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.