శత్రువులుగా..

విశాల్‌, ఆర్య కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందనుంది. బుధవారం టైటిల్‌ని ప్రకటించారు. ‘ఎనిమీ’ పేరును ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: ఆర్‌.డి. రాజశేఖర్‌. ఇతర తారాగణం, సాంకేతిక వర్గ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. విశాల్‌కి 30వ చిత్రంకాగా ఆర్యకు 32వ సినిమా. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాడు వీడు’ ఆకట్టుకుంది. ఈసారి ఎలా అలరిస్తారో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.