పవన్‌ తర్వాత చిరుతో..

పవన్‌ కల్యాణ్‌తో చిత్రం పూర్తయ్యాక చిరంజీవితో సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెలిపారు. విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి విచ్చేసిన ఆయన మీడియాతో ముచ్చటించారు. సినీ రంగ ప్రవేశం, ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి పంచుకున్నారు. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ‘‘పవన్‌తో చిత్రం చేసేందుకు కథ సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అవి పూర్తయ్యాక నా సినిమా ప్రారంభమవుతుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్లు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత చిరంజీవితో చిత్రం తీస్తాన’’న్నారు. హరీశ్‌- పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. దాంతో ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు చిరు.. హరీశ్‌ దర్శకత్వంలో నటిస్తే చూడాలని చాలామంది అభిలాష. స్పష్టత రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.