మరో చిత్రం ఫిక్స్‌ చేసిన హరీశ్‌


ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ చిత్రం ప్రకటించాడు హరీశ్‌ శంకర్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే కథ పూర్తయింది. లాక్‌డౌన్‌ అనంతరం పట్టాలెక్కనుందీ చిత్రం. ఇదిలా ఉండగానే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ హరీశ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘గద్దల కొండ’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్‌. దీన్ని ఉద్దేశిస్తూ ‘ గద్దల కొండ గణేష్‌ తర్వాత మరోసారి పవర్‌ఫుల్‌ దర్శకుడు హరీశ్‌తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని ట్వీట్‌ చేసింది 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.