‘హిరణ్య కశ్యప’పై.. అధికారిక ప్రకటన

‘హి
రణ్య కశ్యప’.. తెలుగు చిత్రసీమలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న భారీ బడ్జెట్‌ ప్రాజెక్టిది. రానా కథానాయకుడిగా నటించబోయే ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, తర్వాత మళ్లీ ఆ ఊసే వినిపించలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి తొలి అధికారిక ప్రకటన వెలువడింది. తాను ‘హిరణ్య కశ్యప’ పేరుతో ఓ పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నానని, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించబోయే ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు గుణశేఖర్‌ ఓ లేఖ విడుదల చేశారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారట. దీన్ని గుణ.. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుభాషా చిత్రంగా రూపొందబోయే ఈ ప్రాజెక్టులో వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్‌ నటీనటులు కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.