కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. గౌతమ్ కిచ్లుతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె పెండింగ్‌లో ఉన్న తన కొత్త చిత్రాల్ని పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షెడ్యూల్ కాస్త ఆలస్యంగా మొదలు కాబోతుందట. ఈ విరామాన్ని తన తర్వాతి తమిళ చిత్రం కోసం వినియోగించుకుంటోంది చందమామ. ఆమె ప్రస్తుతం తమిళంలో డీకే అనే దర్శకుడితో ఓ హారర్ మల్టీస్టారర్ చేసేందుకు అంగీకారం తెలిపింది. దీనిపై చిత్ర దర్శకుడు తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పష్టత ఇచ్చారు. ఇందులో కాజల్‌తో పాటు మరో ముగ్గురు అగ్ర కథానాయికలు నటించనున్నారని సమాచారం. ఇప్పటికైతే కాజల్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలిసింది.