మంచోడు ఆ రోజు వచ్చేస్తున్నాడు

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంతమంచి వాడవురా’. సతీష్‌ వేగేశ్న దర్శకుడు. మెహరీన్‌ కౌర్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు శుభవార్త చెప్పాడు కల్యాణ్‌ రామ్. విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. ఎప్పుడంటే? 2020 సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.