‘కేజీఎఫ్‌ 2’లో అడుగుపెట్టిన రావు రమేష్‌

ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల్ని కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తిప్పిన చిత్రం ‘కేజీఎఫ్‌’. యశ్‌ కథానాయకుడుగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. దీంతో ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న ‘కేజీఎఫ్‌ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పాత్రని పకడ్భందీగా తీర్చిదిద్దుతున్నారు ప్రశాంత్‌. ఇప్పటికే కీలక పాత్రల కోసం బాలీవుడ్‌ సీనియర్‌ నటులు సంజయ్‌ దత్, రవీనా టండనాను ఎంపిక చేసింది చిత్ర బృందం. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ తెలుగు నటుడు రావు రమేష్‌ చేరారు. తన శైలిలో ఏ పాత్రైనా పండించగల నటుడిగా ఈయనకు టాలీవుడ్‌లో పేరుంది. ఇలాంటి రావు రమేష్‌ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. రమేష్‌ ఎంపికను సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఇంకా ఎవరెవరు ఈ చిత్రంలో ఉండబోతున్నారో? అనే సందిగ్థత రోజురోజుకు పెరుగుతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.