‘ఖైదీ’ దర్శకుడితో విజయ్‌.. 31న సర్‌ప్రైజ్‌!!

‘ఖైదీ’ వంటి ప్రయోగాత్మక కథతో సినీప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తర్వాతి చిత్రాన్ని విజయ్‌ దళపతితో చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘దళపతి 64’గా సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ శుభవార్తను సినీప్రియుల చెవిన వేశారు లోకేష్‌. ఈనెల 31న సాయంత్రం 5 గంటలకు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఓ వైవిధ్యమైన కథాంశంతోనే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చబోతున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.