రవితేజ క్రాక్‌ థియేటర్లలోనే విడుదల

మాస్‌ హీరో రవితేజ రవితేజ కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంది. సెంట్రల్‌ జైలుకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న మహిళ జయమ్మగా సందడి చేయనుంది. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చిన చిత్రం అన్నీ కుదిరితే మే 8న థియేటర్లలో ఈ పాటికే ప్రేక్షకులను అలరించేది. కానీ కరోనా వైరస్‌ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులో కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అవుతూ సందడి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్‌ మలినేని ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేస్తూ..సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.