నేను ఆరోగ్యంగానే ఉన్నాను..

ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. "కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటు
రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళి పోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.