వాలెంటైన్‌ డే రోజునే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్రైలర్‌
రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. కథానాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంలో జరిగిన రాజకీయ, కుటుంబ విశేషాలను ఇందులో ప్రస్తావిస్తునారు. ఆయన అల్లుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందిస్తున్నారని కోర్టులో వ్యాజ్యం దాఖలయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 14 (వాలంటైన్‌ డే ) ఉదయం 9.27 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రకటన లింక్ : https://t.co/mUywB1s9MN
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.