‘అమ్మ’ వెనుక.. ఆస్పత్రిలో ఆ 75రోజులు?

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కథానాయిక జయలలిత జీవితగాథ ఇప్పుడు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె జీవితకథతో దాదాపు నాలుగు పైగా బయోపిక్‌లు సెట్స్‌ పైకి వెళ్లాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. వీటిలో గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్, ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో వస్తున్న బయోపిక్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. తాజాగా జయ కథతో మరో సినిమా సెట్స్‌పైకి ఎక్కేందుకు సిద్ధమైంది. దీనికి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకుడిగా వ్యహరించబోతున్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల సమయంలో ఏం జరిగిందన్న ఇతివృత్తంతో ‘శశి లలిత’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారట. తాజాగా ఈ అంశంపై కేతిరెడ్డి మాట్లాడుతూ ‘‘జయలలితపై ఉన్న అభిమానంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నా. ఆమె ఆత్మ చెప్పిన విషయాల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నా. జయ బాల్యం, నటిగా ఎదగడం, రాజకీయ ప్రవేశం తదితర అంశాలతో పాటు చికిత్స నిమిత్తం 75 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాలను ఇందులో చూపించబోతున్నాం’’ అన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.