‘లవ్‌స్టోరి’ పూర్తయింది!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. లాక్‌డౌన్‌ అనంతరం పునఃప్రారంభమైన ఈ చిత్రం బుధవారం (నవంబరు 18 ) చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది చిత్రబృందం. సెట్‌లో చివరి రోజున దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నాయిక సాయి పల్లవి, కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ ఆనందోత్సాహంలో ఉన్న ఫొటోని జత చేసింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చక్కటి ప్రేమ కథ కోసం నాయకానాయికలు ప్రత్యేకంగా తెలంగాణ యాసను నేర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఎమిగోస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి. బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.