మా' కొత్త అధ్య‌క్షుడు న‌రేష్‌

హోరా హోరీగా సాగిన 'మా' ఎన్నిక‌ల‌లో శివాజీరాజాపై న‌రేష్ గెలిపొందారు. ఆయ‌నే `మా` కొత్త అధ్య‌క్షుడుగా పీఠం ఎక్క‌బోతున్నారు. ఆదివారం 'మా' ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. బ్యాలెట్ ప‌ద్ధ‌తిన జ‌రిగిన ఎన్నికలు కావ‌డంతో కౌంటింగ్‌కి చాలా స‌మ‌యం ప‌ట్టింది. కేవ‌లం 500 ఓట్లు కూడా పోల‌వ్వ‌ని ఈ ఎన్నిక‌ల లెక్క తేల‌డానికి సోమ‌వారం తెల్ల‌వారుఝాము వ‌ర‌కూ ఎదురుచూడాల్సివ‌చ్చింది. శివాజీరాజా చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ఆయ‌న్ని గెలిపిస్తాయ‌నుకుంటే.. న‌రేష్ పెద్ద షాకే ఇచ్చాడు. చివ‌ర్లో.. మెగా కాంపౌండ్‌ని సైతం త‌న వైపు తిప్పుకుని, జీవిత‌ని రంగంలోకి దింపి, మ‌హిళా ఓట్ల‌ని ఆక‌ర్షించిన త‌న ప్యాన‌ల్‌ని గెలిపించుకున్నాడు. న‌రేష్‌తో పాటు.. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ లు కూడా ఈ ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించారు. ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన రాజ‌శేఖ‌ర్.. శ్రీ‌కాంత్‌పై విజ‌యం సాధించారు. జ‌న‌ర‌ల్ సెక‌రెట్రీ ప‌ద‌వి కోసం ర‌ఘుబాబు, జీవిత పోటీ చేస్తే.. జీవిత గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజ‌యం సాధించారు. జాయింట్ సెక్ర‌ట‌రీగా గౌత‌మ్ రాజు, శివాజీ రాజా గెలిచారు. వీళ్ల‌తో పాటు అలీ, ర‌విప్ర‌కాష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, ఫృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌద‌రి, అశోక్ కుమార్, స‌మీర్‌, ఏడిద శ్రీ‌రామ్‌, రాజా ర‌వీంద్ర‌, త‌నీష్‌,. జ‌య‌ల‌క్ష్మీ, కరాటే క‌ల్యాణి, వేణుమాధ‌వ్‌, ప‌సునూరి శ్రీ‌నివాస్ ఈసీ మెంబ‌ర్స్ గా గెలిచారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.