‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’ అందరూ చదవాల్సిన బుక్‌

ఏంటి? మహేష్‌ బాబు.. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పకుండా పుస్తకం గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ‘మహర్షి’ సినిమాలోని ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌ ఇట్స్‌ ఏ జర్నీ’ డైలాగ్‌ గుర్తుంది కదా.. ఆ కాన్సెప్టే సినిమాకు ప్రధానంగా నిలిచింది. ఇలాంటి ఎన్నో స్ఫూర్తివంతమైన అంశాలతో ‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’ పుస్తకంలో ఉన్నాయంటున్నాడు మహేష్‌. ఐఏఎస్‌ బుర్రా వెంకటేశం ‘మహర్షి ఎడిషన్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని రచించారు. దీన్ని చదివిన ఆయన ‘రచయిత వెంకటేశం గారికి అభినందనలు. విజయం అంటే ఇది అని చెప్పే ఈ పుస్తకంలో విజేతగా నిలిచేందుకు చేయాల్సిన ప్రయత్నాలు, అందుకు కావాల్సిన ప్రణాళికలు రచించుకోవడం లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. మీ స్నేహితులు, బంధువులకు బహుబతిగా ఈ పుస్తకం అందిచాలని కోరుతున్నాన’ని ట్విటర్‌ వేదికగా కోరాడు. తప్పకుండా చేస్తామంటూ అభిమానులు రీట్వీట్స్‌ పెడుతున్నారు. ఓ పుస్తకం గురించి మహేష్‌ ఇలా చెప్పడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.