మహి సర్‌ప్రైజ్‌ ట్వీట్‌.. ‘యాత్ర 2’కి శ్రీకారం!
త్కంఠకు తెర పడింది. కొద్దినెలలుగా హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరానికి ఫలితాల వెల్లడితో శుభం కార్డు పడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నిజం చేస్తూ.. మరోసారి ప్రధాని పీఠంపై మోదీ ప్రభుత్వం కొలువుతీరబోతుండగా.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు మహి.వి.రాఘవ్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌లో అంత స్పెషల్‌ ఏముందంటే.. త్వరలోనే ఆయన ‘యాత్ర 2’కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఇటీవలే ఆయన వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ను తెరకెక్కించి హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా జగన్‌ జీవితగాథతో ‘యాత్ర 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారట. ఇందులో వైఎస్సార్‌ మరణం తర్వాత నుంచి జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టడం.. ఇటీవల ఆయన చేసిన పాదయాత్ర.. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక పీఠం చేజిక్కించుకోవడం తదితర అంశాలన్నింటినీ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ అంశాల చుట్టూనే మహి కథను అల్లుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది.. జగన్‌ పాత్రను ఎవరు పోషిస్తారు? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.