‘మజిలీ’ విడుదల తేదీ మార్పులేదు

సమంత, నాగచైతన్యలు జంటగా నటిస్తున్న సినిమా‘మజిలీ’. షైన్‌ పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించారు.ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ మారిందనే ప్రచారం జరుగుతోందని చిత్రబృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని సినిమా విడుదల తేదీలో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్‌ 5నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.