‘విజయ్‌64’లో మాళవిక మోహనన్‌

తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమా ‘విజయ్‌ 64’గా రూపొందుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథానాయిక విషయంపై కోలీవుడ్‌లో రకరకాల వార్తలు వచ్చాయి. విజయ్‌ సరసన రాశిఖన్నా, రష్మిక మందన్నా నటిస్తున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది చిత్రబృందం. మాళవిక మోహనన్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. మాళవిక గతంలో రజనీకాంత్‌ కథానాయకుడుగా వచ్చిన ‘పేట’ చిత్రంలో మెరిసింది. 2020 వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.