వినూత్న కథతో మనోజ్‌ వచ్చేస్తున్నాడు..

కారణం ఏదైనా యువ కథానాయకుడు మంచు మనోజ్‌ సినిమాలకు విరామం ఇచ్చి మూడేళ్లయింది. మళ్లీ ఎప్పుడు కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తాడా? అని ఆశగా ఎదురు చూశారు అభిమానులు. తాజాగా తదుపరి చిత్రం గురించి ప్రకటించి వాళ్లని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకే ప్రాముఖ్యం ఇచ్చే మనోజ్‌ మరోసారి వినూత్న కథతో రాబోతున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అని టైటిల్‌తోనే ఆసక్తి పెంచుతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతుందీ చిత్రం. విద్య నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో నిర్మల దేవి, మనోజ్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడు. మార్చి 6న ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు మనోజ్‌. ‘‘మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నా. నా మొదటి సినిమా ‘దొంగ దొంగది’ సమయంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అదే ఫీలింగ్‌తో ఉన్నా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇంతకాలం నాకు ప్రోత్సాహం అందించిన అందరికీ ధన్యవాదాలు. నాకు జీవితమైన సినిమాకు దూరమయ్యాను. సినీ అమ్మా! వచ్చేశా’ అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.