మిథాలీ రాజ్‌గా తాప్సి

ఇటీవలే ‘శాండ్‌ కీ ఆంఖ్‌’ అనే 70 ఏళ్ల వయసున్న షూటర్‌ జీవితగాథలో నటించి మెప్పించింది తాప్సి. ఆ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితకథలో నటించబోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ విషయంపై చర్చలు సాగాయి. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబరు 3న మిథాలీ పుట్టిన రోజు సంద్భంగా.. ఆ వేడుకకు హాజరైంది తాప్సి. ఆ సమయంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా మిథాలీగా వెండితెరపై కనిపించబోతున్నానని వెల్లడించింది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ‘శభాష్‌ మిథు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దర్శకుడు రాహుల్‌ ధొలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.