‘మురళీధరన్‌’ బయోపిక్‌.. అప్‌డేట్‌ త్వరలో

విలక్షణ పాత్రలకు చిరునామాగా నిలిచే తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి.. ఆసక్తికర జీవితగాథతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితకథలో సేతుపతి నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌, డార్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి ట్వీట్‌ చేశారు విజయ్‌సేతుపతి. ‘ఈ అద్భుతమైన చిత్రంలో భాగస్వామి అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ రాబోతుంద’ని తెలిపారు. గతంలో ఈ చిత్రానికి ‘800’ అనే పేరు పెట్టినట్లు వార్తలొచ్చాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.