‘ఇస్మార్ట్‌ బ్యూటీ’ బర్త్‌డే నేడు

'నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో మొదటిసారి వెండితెరపై మెరిసింది నభానటేష్‌. మొదటి సినిమాతోనే తనలో నటన, గ్లామర్‌ రెండు ఉన్నాయని చెప్పింది. ఆ తరువాత ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో గ్లామర్, నృత్యాలతో కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఇందులో రామ్‌కి పోటీగా నభా వేసిన స్టెప్పులు సినిమాకే ప్రత్యేకం. ఈ సంవత్సరంలోని విజయవంతమైన చిత్రాలలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఒకటి. ఇందులో నభా గ్లామర్‌కి మంచి మార్కులతో పాటుగా వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ భామ రవితేజతో ‘డిస్కోరాజా’, సాయిధరమ్‌ తేజ్‌ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ బెల్లం కొండ సాయిశ్రీనివాస్‌ నూతన చిత్రంతో పాటుగా మరో తమిళ సినిమాలోను నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘డిస్కోరాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్ర బృందాలు జన్మదిన శుభాకాంక్షలు చెపుతూ కొత్త పోస్టర్‌లను విడుదల చేశాయి. వచ్చే ఏడాదిలో నభా నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకురానుంది ఈ గ్లామర్‌ బ్యూటీ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.