చైతూ, పల్లవి ‘లవ్‌స్టోరి’

ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల దారే వేరు. ‘ఫిదా’తో మంచి విజయం అందుకున్న ఆయన నాగ చైతన్య, సాయి పల్లవితో ఓ చిత్రం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసలో సాగే సరికొత్త ప్రేమకథట ఇది. ఈ చిత్రానికి ఏం టైటిల్‌ పెట్టబోతున్నారా? అని టాలీవుడ్‌లో ఆసక్తిరేకింది గతంలో. చాలా మంది చిత్ర బృందం ఖరారు చేయకముందే టైటిల్‌ ఇదే అంటూ వార్తలొచ్చాయి. దీంతో ఆ చిత్ర టైటిల్‌ విషయంలో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇంతకీ టైటిల్‌ ఏంటంటే.. ‘లవ్‌ స్టోరి’. అందరూ ఊహించిన టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు చైతూ, పల్లవి. ఈ పోస్టర్‌లో పల్లవి భావోద్వేగానికి గురై చైతూ చొక్కాను పట్టుకుని తన బాధను తెలియజేస్తున్నట్లు కనిపించింది. వాళ్ల ప్రేమ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని పెంచుతుంది. ఎమిగోస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి. బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.