‘ఎన్‌ఎస్‌ 20’ టైటిల్‌ ఇదే

ప్రాచీన విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కేతికశర్మ కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు రూపొందిస్తున్నాయి. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. సోనాలి నారంగ్‌ సమర్పిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘లక్ష్య’ అనే పేరుని ఖరారు చేశారు. సోమవారం పేరుతో కూడిన ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. క్రీడా నేపథ్యంతో కూడిన చిత్రమిది. ఈ చిత్రం కోసం నాగశౌర్య ఎనిమిది పలకల దేహాన్ని సిద్ధం చేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.