‘అశ్వథ్థామ’ వచ్చేది అప్పుడే

యు
వ కథానాయకుడు నాగశౌర్యతో దర్శకుడు రమణతేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. 2020 జనవరి 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శౌర్య సరసన మెహరీన్‌ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.