నాని బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇదే!

యు
వ కథానాయకుడు నాని అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. ఫిబ్రవరి 24 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్‌ ఏంటంటే? ప్రస్తుతం ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న నాని మరో చిత్రానికి పచ్చజండా ఊపాడు. సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. నానికి ఇది 27వ సినిమా. ఈ చిత్ర టైటిల్‌ను రేపు ప్రకటించనుంది చిత్ర బృందం. దీంతోపాటు కాన్సెప్ట్‌ వీడియోను సిద్ధం చేశారు. మరి నాని ఈ సారి ఎలాంటి ఆసక్తికర టైటిల్, కథతో వస్తాడో చూడాలి. ఎప్పటి నుంచో ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ నానితో ఓ చిత్రం చేస్తాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్‌డేట్‌తో ‘నాని 27’ని తెరకెక్కించేది రాహుల్‌ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అవునా, కాదా? కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.