‘శ్యామ్‌ సింగరాయ్‌’గా ఆసక్తి పెంచుతున్న నాని

యు
వ కథానాయకుడు నాని సినిమాల జోరు పెంచాడు. ఒక చిత్రంలో నటిస్తూనే రెండు కొత్త చిత్రాలు లైన్లో పెట్టాడు. ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘టక్‌ జగదీష్‌’ చిత్రీకరణలో ఉంది. తాజాగా 27వ చిత్రాన్ని ప్రకటించాడు. నేడు నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం టైటిల్‌తో కూడిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో చిత్ర పేరుతోపాటు విడుదల తేదీని రూపొందించారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇంతకీ శ్యామ్‌ సింగరాయ్‌.. ఒకరా, ఇద్దరా అనే ఆశ్చర్యంలో పడేశారు. సందేహం వీడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాయిక, సాంకేతిక వర్గ వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.