అభిమానులకు నితిన్‌ విన్నపం

లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలని, ఎవరూ తన పుట్టిన రోజు వేడుకల్ని జరపొద్దని అభిమానుల్ని కోరాడు యువ కథానాయకుడు నితిన్‌. మార్చి 30 నితిన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. మీరు నా జన్మదిన వేడుకల్ని జరపొద్దని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఏప్రిల్‌ 16న జరగాల్సిన నా వివాహాన్ని వాయిదా వేస్తున్నాను. మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పోరాటం చేయాలి. ఈ సంక్షోభ సమయంలో ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో ఉండటమే దేశానికి సేవ చేసినవాళ్లం అవుతామ’’ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం నితిన్‌ ‘రంగ్‌ దే’ చిత్రంలో నటిస్తున్నాడు.











Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.